హీరో నాగార్జున ఇంట్లో తీవ్ర విషాదం
తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. హీరో నాగార్జున సోదరి నాగ సరోజ మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా నాగ సరోజ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం నాగ సరోజ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. నాగ సరోజ మరణించినట్లు కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు.

దీంతో అక్కినేని ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.సోదరి మరణంతో నాగార్జున కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది. నాగ సరోజ హీరో నాగార్జునకు మూడో అక్క. అక్కినేని నాగేశ్వరరావుకు మొత్తం ఐదుగురు సంతానం కాగా, నాగ సరోజ మూడో కుమార్తె . సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జున ఇలా ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు అక్కినేని నాగేశ్వరరావుకు సంతానంగా ఉన్నారు.

నాగ సరోజ మంగళవారం ఉదయమే మరణించినప్పటికీ..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగ సరోజ మరణంతో అక్కినేని విషాదం నెలకొంది. ఈ విషయం తెలుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు నాగార్జునను పరామర్శిస్తున్నారు. నాగ సరోజ అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications