'తమ్ముడు వస్తున్నాడు'.. ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన కళ్యాణ్ రామ్
నందమూరి కుటుంబంలో హీరోలను కలిసి చూడాలని అభిమానులు ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటారు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ లో కలసి కనిపించారు. మళ్లీ ఆ తర్వాత నుంచి బాలయ్య - ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి కనిపించలేదు. గత కొంతకాలంగా బాబాయ్ - అబ్బాయిల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తోంది. అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం పలు కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి ఈ అన్నదమ్ములు కలిసి ఓకే స్టేజి పైకి రానున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'దేవర 1' మూవీ ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఆ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించడంతో ఆ రకంగా అయిన ఇద్దరు కలిసి కనిపిస్తారని భావించారు. కానీ ఈవెంట్ రద్దు అవ్వడంతో అభిమానులు ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ లోటును 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాతో భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అయింది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి, అందులో పాల్గొనే చీఫ్ గెస్ట్ గురించి అప్డేట్ అందించారు. ఏప్రిల్ 12న గ్రాండ్ గా ఈవెంట్ చేస్తామని.. తన తమ్ముడు తారక్ ఈ వేడుకకు రానున్నట్టు రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
'బింబిసార' సినిమాతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ తర్వాత వచ్చిన 'అమిగోస్' మూవీ ప్లాప్ అయినప్పటికీ, 'డెవిల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించుకుంది. దాంతో ఈ సినిమాపైనే నందమూరి ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Mother - Son ❤️
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 9, 2025
A bond that will be celebrated and treasured till eternity ✨
'𝐀𝐑𝐉𝐔𝐍 𝐒/𝐎 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈' second single #MuchatagaBandhaale out now https://t.co/FGAloaQ5TH
GRAND RELEASE WORLDWIDE ON APRIL 18th, 2025. #ArjunSonOfVyjayanthi
మరోవైపు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు బాబాయ్ బాలకృష్ణతో కలిసి బాల గోపాలుడు చిత్రంలో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బాబాయ్ నుంచి నటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. బాల బాబాయ్ ఎప్పుడూ తనకు స్ఫూర్తి అని.. ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications