మహేష్‌బాబుపై నాని సంచలన వ్యాఖ్యలు

హీరో నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అన్ని భాషల్లో ఈనెల 29న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు నాని చేసిన దసరా, హాయ్ నాన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని నమోదు చేశాయి. నాని కెరీర్ లో తొలిసారిగా 100 కోట్లరూపాయలు వసూలు చేసిన చిత్రంగా దసరా నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకుడు. తర్వాత విడుదలైన హాయ్ నాన్న కూడా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది.

అన్ని భాషల్లో విడుదల కాబోతోంది
ఎస్ జే సూర్యతో కలిసి నాని సరిపోదా శనివారంలో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు లాంటి హీరో పాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించడానికి ఓ మంచి సినిమాతో రావాలని ఆశించారు. అందుకు తగ్గట్లుగానే రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం దేశంలోని అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. అయితే నాని మాత్రం తన ప్రతి సినిమాను పాన్ ఇండియా సినిమాగానే ఎందుకు విడుదల చేస్తున్నారు? అని యాంకర్ నానిని అడిగారు.

hero nani sensational comments on telugu superstar mahesh babu

ఆడియన్స్ ను పెంచుకుంటూ వెళుతున్నా
తాను హీరోగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు ఎవరికీ తెలియదని, కానీ మహేష్ బాబు రావడమే సూపర్ స్టార్ గా ప్రవేశించారన్నారు. ఆయనకు భారీ సంఖ్యలో అభిమానుల బలం ఉందని, కానీ తనకు అంత అభిమానుల బలం లేదన్నారు. ఒక పరిపూర్ణమైన సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాలని మహేష్ బాబు భావించారు.. ఆయన ఆలోచన సరైందన్నారు. అదే సమయంలో తన స్ట్రాటజీ కూడా సరైందే అని నాని అన్నారు. సినిమా సినిమాకు ఆడియన్స్ ను పెంచుకుంటూ వెళ్లాలని తాను అనుకుంటున్నానని, తెలుగుతోపాటు అన్ని భాషల్లోను అదే చేస్తున్నానన్నారు. మహేష్ బాబుకు ఆయన స్ట్రాటజీ సరైందే అయితే.. తనకు కూడా తన స్ట్రాటజీ సరైందే అని భావిస్తున్నానని నాని చెప్పారు. ప్రస్తుతం తను చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+