స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్.. యాంకర్ గానే నెట్టుకొస్తున్న బ్యూటీ ?

చిత్ర పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఓవర్ నైట్ లోనే స్టార్లు అయిపోయిన వారు ఎందరో ఉంటే.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి కూడా గుర్తింపునకు నోచుకోని వారు కూడా ఉన్నారు. అయితే పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా.. సహాయ నటిగా .. ఇలా పలు పాత్రల్లో నటించి ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి బుల్లితెరపై సెటిల్ అయిపోయింది ఓ నటి. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేస్తున్న ప్రోగ్రాంలో పాల్గొన్న స్టార్ హీరో ఆమె గురించి ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఏమైందో తెలీదు కానీ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆ యాంకర్ ఎవరో కాదు.. ప్రముఖ నటి రష్మీ గౌతమ్. వెండితెరపై పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది రష్మి. అయితే అవకాశాలు తగ్గడంతో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ భామ.. తనదైన శైలిలో అందర్నీ ఫిదా చేసింది. ఇక జబర్దస్త్ లో వచ్చిన గుర్తింపుతో వెండి తెరపై కూడా మళ్ళీ వరుస అవకాశాలు అందుకుంది. గుంటూరు టాకీస్, సహా పలు సినిమాల్లో నటించిన రష్మి మళ్లీ బిజీ అవ్వలేకపోయింది. దీంతో మళ్లీ జబర్దస్త్ లోనే కంటిన్యూ అవుతూ వస్తోంది.

hero-nithin-shocking-comments-on-anchor-rashmi-goes-viral

అయితే అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గానే నితిన్, శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ లో ఉగాది ఈవెంట్ నిర్వహించారు. అందులో నితిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. జయం సినిమాకి రష్మీ, నేను కలిసి రిహార్సల్స్ చేశాం.. దాదాపు 90 శాతం సీన్లు కూడా రష్మీ తోనే రిహార్సల్స్ చేయించారు. చివర్లో ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ ని మార్చేశారు. ఒకవేళ ఆ సినిమా రష్మీ చేసి ఉంటే ఖచ్చితంగా అప్పుడే స్టార్ హీరోయిన్ అయిపోయేది అంటూ వ్యాఖ్యానించారు.

ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన 'జయం' సినిమాతోనే నితిన్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఆ మూవీలో నటించిన సదా కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాల్లో తక్కువ గానే కనిపిస్తున్న సదా.. పలు షో లకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో రష్మీకి రావాల్సిన అదృష్టం సదాకి దక్కిందని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సదా కాకుండా ఆ సినిమాలో రష్మి నటించి ఉంటే ఇప్పుడు ఆమె పరిస్థితి వేరేలా ఉండేది అని అంటున్నారు.

ఇక ప్రస్తుతం రష్మి జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ.. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ కి దూరంగా ఉంటుంది. ఇక బుల్లితెరపై రష్మీ - సుధీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. వీరిద్దరూ నిజజీవితంలో కూడా వివాహం చేసుకోవాలని అభిమానులు కూడా తెగ కామెంట్స్ చేస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+