తల్లిదండ్రులైన ప్రభాస్-అనుష్క?
ప్రభాస్-అనుష్క తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు. స్క్రీన్‌మీద వారిద్దరి ప్రజెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ సినిమాలు చేశారు. ఆయా సినిమాల్లో వీరిద్దరి జంటను చూసి అందరూ మురిసిపోయారు. ప్రేక్షకులు, అభిమానులు ఈ జంట ఎంతో బాగుందంటూ కొనియాడారు.
వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని, పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే అనుష్క వాళ్ల నాన్న ప్రభాస్ ను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారంటూ అందరూ ఎదురు చూసినప్పటికీ వారి నుంచి అటువంటి ప్రకటనేమీ రాలేదు.

వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్, అనుష్క విడివిడిగా స్పందించారు. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ప్రభాస్-అనుష్క వార్తల్లో నిలిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఉపయోగించి అభిమానులు ప్రభాస్, అనుష్క ఫొటోలను తయారు చేస్తున్నారు.

ఈ టెక్నాలజీ ద్వారా ఫోటోలను ఎడిట్ చేయడం చాలా ఈజీ. దీంతో తమ అభిమాన తారలను తమకు నచ్చిన రీతిలో ఎడిట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కాస్త అడ్వాన్స్ అయ్యారు. ప్రభాస్‌కి, అనుష్కకి పెళ్ళి చేసి, ఒక పాపకు తలిదండ్రుల్ని కూడా చేసేశారు. ఇది ప్రభాస్ కుటుంబం.. అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎడిట్ చేసి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసి ప్రభాస్, అనుష్క పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని తాము కోరుకుంటున్నట్లు డార్లింగ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications