రాజమౌళి రికార్డును తుక్కు తుక్కు చేసిన ప్రభాస్
వైజయంతీ మూవీస్ పతాకంపై పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రూ.1050కు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రూ.1200 కోట్లవైపు పరుగులు తీస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూ.600 కోట్ల బడ్జెట్ తో సి. అశ్వనీదత్ తీసిన ఈ సినిమా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు రూపాయికి రూపాయి లాభాన్ని ఆర్జించి పెట్టింది. భవిష్యత్తులో మరిన్ని లాభాలను అందించబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా స్పీడు తగ్గడంలేదు
ఆర్ఆర్ఆర్ రికార్డు బద్ధలు
రికార్డులపై రికార్డులను నెలకొల్పుతున్న ఈ సినిమా తాజాగా మరో రికార్డును సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం హిందీలో కొల్లగొట్టిన కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. ఆ సినిమా హిందీ వెర్షన్ లో రూ.274 కోట్లు సాధించగా, తాజాగా ప్రభాస్ కల్కి సినిమా రూ.278 కోట్లు సాధించి తనను పాన్ ఇండియా హీరోగా మార్చిన రాజమౌళి రికార్డును బద్దలు కొట్టాడు. హిందీలో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే దిశగా ముందుకు పయనిస్తోంది.

అమెరికాలో రూ.100 కోట్లు?
అమెరికాలో ఈ సినిమా అతి త్వరలోనే రూ.100 కోట్లు సాధించిన తొలి సినిమాగా నిలవబోతోంది. పురాణాలను సైన్స్ ఫిక్షన్ కు ముడిపెట్టి నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించి ఈ సినిమాకు అమెరికాలో భారీ నీరాజనాలు పలుకుతున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమా కావడంతో అమెరికన్లకు పురాణాలుండటంతో భారతీయులకు బాగా నచ్చుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి అతిరథ మహానటులంతా కామియో పాత్రలు పోషించి చిత్ర విజయంలో పాలుపంచుకున్నారు.
నెంబర్ వన్ గా బాహుబలి2
హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా బాహుబలి2 నిలిచింది. ఈ సినిమా రూ.511 కోట్లు సాధించగా, రెండో స్థానంలో కేజీఎఫ్2 రూ.434 కోట్లు, కల్కి రూ.278 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ.274 కోట్లు, రోబో2 రూ.189 కోట్లు సాధించాలి. అలాగే సలార్ రూ.153 కోట్లు సాధించి ఆరోస్థానంలో, సాహో రూ.143 కోట్లతో ఏడోస్థానంలో, రూ.118 కోట్లతో బాహుబలి ఎనిమిదో స్థానంలో, రూ.108 కోట్లతో పుష్ప తొమ్మిదో స్థానంలో, రూ.79 కోట్లతో కాంతార పదో స్థానంలో నిలిచాయి. ఈ సినిమాలన్నీ కూడా కేవలం డబ్బింగ్ సినిమాలుగానే రికార్డులు నెలకొల్పాయి.












Click it and Unblock the Notifications