'కూలీ' సినిమా అట్టర్ ఫ్లాప్ కు ప్రధాన కారణం రజనీకాంతే!
కూలీ సినిమా ఫ్లాప్ అవడానికి ప్రధాన కారణం రజనీకాంతే. వాస్తవానికి కూలీ కథ కన్నా ముందే రజనీకాంత్ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక అద్భుతమైన థ్రిల్లర్ స్క్రిప్ట్ ను రాసుకున్నారు. పాత్ర మొత్తం రజనీకాంత్ చుట్టూనే తిరుగుతుంది. ఇది విన్న తర్వాత రజనీ జైలర్ తరహా కథ అయితే బాగుంటుందని, అటువంటి స్క్రిప్ట్ తయారుచేయమని కోరారు. దీంతో ముందు అనుకున్న కథను పక్కనపెట్టి కూలీ సినిమా కథ రాసుకున్నారు. అందులో నాగార్జున, ఉపేంద్ర, అమిర్ ఖాన్ లాంటి స్టార్లు కూడా భాగమయ్యారు.
క్యామియోలకు ఆదరణ దక్కలేదు
దీనికి కారణం.. రజనీకాంత్ తన పాత్ర చాలా సింపుల్ గా ఉంటూ, కొంతమంది స్టార్లు క్యామియో పాత్రలు చేస్తే చాలు అనేలా జైలర్ సినిమా భావనలోనే ఉన్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిసారీ అటువంటి కథలు, పాత్రలు కుదరవని, ముందుగా లోకేష్ చెప్పిన కథను చేస్తే ఫలితం మరోలా ఉండేదంటున్నారు. జైలర్ తరహాలోనే స్టార్లు క్యామియో పాత్రలు పోషించినప్పటికీ అవి పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. సినిమాకు మిశ్రమ స్పందన దక్కినప్పటికీ మొదటి నాలుగు రోజులు ఉన్న కలెక్షన్లు సోమవారం నుంచి పూర్తిగా తగ్గిపోయాయి.

జైలర్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావాలి
లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడు కూడా రజనీకాంత్ లాంటి అగ్ర కథానాయకుడితో సినిమా వల్ల మొహమాటానికి పోతే ఫలితం ఎలా ఉంటుందనేదానికి కూలీయే ప్రత్యక్ష నిదర్శనం. దర్శకుడు అనే వ్యక్తి తాను రాసుకున్న కథకు, తయారుచేసుకున్న స్క్రిప్ట్ కు కట్టుబడి ఉండాలి. దాని ప్రకారమే సినిమా తీయాలి. అటువైపు చిన్న హీరో ఉన్నా, పెద్ద హీరో ఉన్నా కథ, స్క్రిప్టే బలం. అగ్ర దర్శకుడిగా దేశంలోనే చెలామణి అవుతున్న రాజమౌళి ఇదే సూత్రానికి కట్టుబడి ఉంటారు.
ఎంతటి హీరో అయినా రాజమౌళి కూర్చోమంటే కూర్చోవాలి.. నిల్చోమంటే నిల్చోవాలి. అలా కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోడు. తాను అనుకున్నట్లుగా సినిమా రావడానికి తానే కాదు.. నటులను కూడా చాలా కష్టపెడతాడు. అప్పుడు వచ్చే ఫలితాన్ని చూసిన తర్వాత అందరూ ఆ కష్టాన్ని మర్చిపోతారు. రజనీకాంత్ కూడా జైలర్ అనే హ్యాంగోవర్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేయాలని తన అభిమానులు కూడా కోరుతున్నారు.












Click it and Unblock the Notifications