రవితేజ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో హీరో..ఏకంగా ఆమె కోసం ముంబైకి..?
టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ పోతినేని కూడా ఒకరు. 2002లో తమిళ సినిమా 'కురుంబ'లో బాల నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత 2006రామ్ పోతినేని ఇప్పటివరకు 20 కి పైగా సినిమాలలో నటించారు.దేవదాసు, జగడం, రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్లు రామ్ ఖాతాలో ఉన్నాయి.రామ్ పోతినేని అనేక అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయనకు 2007 లో ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.
అయితే రామ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో రేసులో వెనకపడ్డాడు.రామ్ ప్రస్తుతం తన కొత్త సినిమాలో బిజీగా ఉన్నాడు.ఇదిలా మోస్ట్ ఎలిజిబుల్ లిస్ట్‌లో రామ్ కూడా ఒకడు.రామ్ పెళ్లి గురించి గతంలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ కూడా ప్రచారం వరకే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు రామ్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. రామ్ ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడానే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు..భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా నటించిన ''మిస్టర్ బచ్చన్''సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, తన తొలి సినిమాతోనే అదరగొట్టింది.సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.సినిమాలో తన అందాలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. మాస్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.
సినిమాలో అమ్మడు అందాలను ఆరబోసింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం రామ్‌తో ఓనిమా చేస్తోంది. చాలా తక్కువ టైమ్ లోనే ఘాడంగా ప్రేమించుకుంటున్నారట ఈ జంటసినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో, వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.భాగ్యశ్రీ బోర్సే కోసం రామ్ ముంబై కూడా తరచూ వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై వీరిద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications