సెప్టెంబరులో రామ్ పోతినేని నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
యంగ్, డైనమిక్ హీరో రామ్ పోతినేని వచ్చే నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజు డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో పలకరించబోతున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. థియేట్రికల్ హక్కులతోపాటు ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుబోయాయి. దీనితర్వాత పి.మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైదరాబాద్ సంబంధం
రామ్ వివాహం గురించి కొన్ని సంవత్సరాలుగా ఏదోవిధంగా వార్తలు వస్తూనే ఉన్నాయికానీ అవేవీ నిజం కాలేదు. ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ, మరో హీరోయిన్ తో త్వరలోనే నిశ్చితార్థం జరగబోతోందంటూ అంతులేని వార్తలు వచ్చాయికానీ ఇంతవరకు రామ్ వివాహం మాత్రం జరగలేదు. అసలు రామ్ పోతినేని వివాహమే చేసుకోనంటున్నాడంటూ మరోసారి వార్త వచ్చింది. చివరకు ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ తల్లిదండ్రులతోపాటు అతని పెదనాన్న స్రవంతి రవికిషోర్ కూడా ఓ సంబంధం చూసినట్లు తెలుస్తోంది.

సెప్టెంబరులో నిశ్చితార్థం
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురును వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో వీరి నిశ్చితార్థం జరగనుంది. ఆమె పేరుమీద హైదరాబాద్ నగరంలోనే వందల కోట్లరూపాయల విలువచేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి పెళ్లిని ఈ సంవత్సరమే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. సెప్టెంబరులో నిశ్చితార్థం జరిపి డిసెంబరులో పెళ్లి చేసే వీలున్నట్లు తెలుస్తోతంది. వీరి వివాహానికి సంబంధించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. వారియర్, స్కంద సినిమాలు ఫ్లాపవడంతో రామ్ కూడా డబుల్ ఇస్మార్ట్ మీద భారీగా ఆశలు పెట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications