పెళ్లిపీటలు ఎక్కబోతున్న రామ్.... వధువు ఎవరంటే?
యంగ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో పకలరించాడు. ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. పూరీ ఇంకా పాత చింతకాయ పచ్చడి టైపులోనే సినిమాలు తీస్తున్నాడని, స్టైల్ మార్చాలంటూ విమర్శలు వచ్చాయి. పూరీ మీద నమ్మకంతో ఈ సినిమా చేసినందుకు రామ్ కు భారీ డిజాస్టర్ దక్కింది. దీంతో తన తర్వాత సినిమా మహేష్ బాబు దర్శకత్వంలో చేయబోతున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను తీసిన మహేష్ బాబు చెప్పిన కథ నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.
వాయిదా పడిన నిశ్చితార్థం
ప్రస్తుతం రామ్ కు 36 సంవత్సరాల వయసు. తన వయసు హీరోలంతా వివాహాలు చేసుకుంటున్నారు. మరికొందరైతే రెండు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. రామ్ మాత్రం ఇంతవరకు పెళ్లిమాటే ఎత్తడంలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ తల్లిదండ్రులతోపాటు అతని పెదనాన్న స్రవంతి రవికిషోర్ కూడా ఓ సంబంధం చూసినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి రామ్ కు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసని, సన్నిహితురాలేనని, ఆ అమ్మాయినే వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆ అమ్మాయినే ఖాయం చేశారు. వాస్తవానికి వీరి నిశ్చితార్థం సెప్టెంబరులో జరగాల్సివుందికానీ వాయిదా పడింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే మార్చిలో నిశ్చితార్థం
ప్రస్తుతం ఈ నిశ్చితార్థాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే మార్చిలో జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు అని తెలుస్తోంది. ఆ అమ్మాయి పేరుమీద హైదరాబాద్ నగరంలో వందల కోట్లరూపాయల విలువ చేసే ఆస్తులున్నట్లు సమాచారం. త్వరలోనే నిశ్చితార్థంపై అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు.
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో హిట్లు సాధిస్తే, వాటి క్రెడిట్ మొత్తం ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట రూపంలో కొట్టుకుపోయింది. దీంతో ఎలాగైనా కచ్చితంగా సూపర్ హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో రామ్ ఉన్నాడు. బోయపాటిని నమ్ముకుంటే భారీ డిజాస్టర్ ఇచ్చాడనే బాధలో ఉన్న రామ్ కు మహేష్ బాబు ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.












Click it and Unblock the Notifications