మృణాల్ ఠాకూర్‌తో త్వరలో పెళ్లి...! స్పష్టత ఇచ్చిన సుమంత్
కథానాయకుడు సుమంత్, కథానాయిక మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్త వైరలవుతోంది. వారిద్దరి ఫొటో చూసినవారు కూడా అదే నిజమని నమ్మారు. దీనిపై నెటిజన్లు చర్చ పెట్టారు. దీనిపై మౌనంగా ఉన్న సుమంత్ ఎట్టకేలకు దీనిపై స్పష్టత ఇచ్చారు. ఎన్టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మృణాల్ ఠాకూర్ తో తనకెటువంటి వ్యక్తిగత సంబంధం లేదని, సీతారామం సినిమాలో ఇద్దరం కలిసిచేశామని, ఆ సమయంలో ఇద్దరం తీసుకున్న ఫొటో అది అని చెప్పారు.
తన జీవితం సెట్ అయింది..
సీతారామం షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను ఇప్పుడు వైరల్ చేస్తూ వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటున్నారని, ప్రమోషన్స్ లో భాగంగా ఆ ఫొటో తీశారని, వాస్తవానికి ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తాను ఇంతవరకు మృణాల్ తో కనీసం టచ్ లో కూడా లేనని, ఇంతవరకు మాట్లాడలేదన్నారు. అటువంటప్పుడు ఇటువంటి వార్తలన్నీ ఎలా పుట్టుకొస్తాయన్నారు. తన జీవితంలో వివాహానికి తావులేదని, ఆ ఆలోచన కూడా తనకు లేదన్నారు. సినిమాలు చూడటం, జిమ్ కు వెళ్లడం, స్పోర్స్ట్ ఆడటంతో తన జీవితం సరిపోతోందన్నారు.

అఖిల్ పెళ్లయిన తర్వాత చేయాలని..
ప్రస్తుతం అనగనగా అనే కొత్త సినిమా ప్రమోషన్స్ లో సుమంత్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీవీకిచ్చిన ఇంటర్వ్యూను పరిశీలిస్తే జీవితాంతం ఒంటరిగా ఉండాలనే నిర్ణయాన్ని సుమంత్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సుమంత్ ఇంతవరకు పెళ్లి ఆలోచన చేయలేదు. నాగార్జున బలవంతం చేస్తున్నప్పటికీ సుమంత్ మాత్రం ససేమిరా అంటున్నాడు. అఖిల్ వివాహం కూడా అయిపోయిన తర్వాత సుమంత్ కు పెళ్లిచేయాలనే యోచనలో నాగ్ ఉన్నాడు. అయితే సుమంత్ చెప్పిన మాటల ప్రకారం అతను జీవితంలోనే పెళ్లికి దూరం అంటున్నట్లుగా ఉన్నాయి. మరి అక్కినేని కుటుంబ సభ్యులు ఏం చేస్తారో చూడాలి. నాగచైతన్యకు శోభితతో వివాహం జరిగింది. ఆ తర్వాత అఖిల్ కు జైనబ్ రబ్జీతో నిశ్చితార్థం జరిగింది. సుమంత్ సోదరి కి కూడా వివాహం చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications