హీరో సూర్యకు ఘోర ప్రమాదం..హుటాహూటిన ఆసుపత్రికి తరలింపు

తమిళ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుతుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా సూర్యకు గాయాలు అయినట్టు తెలుస్తుంది. సూర్య ప్రస్తుతం 'కంగువ అనే' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చైన్నై నగర శివార్లలో జరుగుతుంది. రిస్క్‌తో కూడిన స్టంట్లు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఫైటింగ్ సీన్ చిత్రికరిస్తుండగా..సూర్య భూజానికి, కంటికి బలమైన గాయం అయింది.

దీంతో వెంటనే చిత్ర యూనిట్ సూర్యను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మెరుగైనా వైద్యం కోసం ఆయన్ను ఈ రోజు సాయంత్రానికి చైన్నైకు తరలించే అవకాశం ఉంది. సూర్య ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. సూర్యకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 Hero Suriya had a serious accident in kanguva movie shooting

ఆయనకు ఏం కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'కంగువ' సినిమా సూర్య కెరీర్‌లోనే ప్రతిష్మాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్దం అవుతుంది. 'కంగువ'ను దాదాపు 38 భాషల్లో విడుదల చేస్తున్నామని మూవీ మేకర్స్ ప్రకటించారు.ఇప్పుడు సూర్యకు గాయం కావడంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+