హీరో భార్యపై కన్నేసిన నిర్మాత..పడుకుంటే బంపర్ ఆఫర్ అంటూ ప్రపోజల్
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. హీరోయిన్ వితిక షేరు తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
వితిక షేరు'అంతు ఇంతు ప్రీతీ బంతు' అనే కన్నడ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచియం అయింది. ఆ తరువాత హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయి పలు సినిమాల్లో నటించింది. ప్రేమించు రోజుల్లో, ఛలో 123,మై నేమ్ ఈజ్ అమృత, వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. హీరో వరుణ్ సందేశ్‌తో ప్రేమయాణం సాగించిన వితిక...అతన్ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న వితిక..ఆ మధ్య భర్తతో కలిసి రియాల్టీ షో బిగ్‌బాస్‌లో సందడి చేసింది.

వితిక తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలు పంచుకుంది. నా పేరు కాస్త డిఫరెంట‌్‌గా ఉండటంతో నన్ను నార్త్ అమ్మాయి అనుకోని ఆడిషన్స్‌కి పిలిచేవారనని... కానీ ఆడిషన్స్‌కు వెళ్లిన తర్వాత తెలుగు అమ్మాయివేనా అని చులకనగా చూసే వారని ఆమె చెప్పకొచ్చింది. నాకు 16 ఏళ్లు వయస్సు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్ ఇచ్చేందుకు వెళ్తే..ఓ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ నన్ను బయటకు పంపించారు.
అమ్మాయికి సినిమాలో ఛాన్స్ కావాలంటే నిర్మాతల సైడ్ నుంచి కమిట్మెంట్ విషయంలో ఒత్తిడి ఉంటుందని చెప్పారు. కమిట్మెంట్ అంటే తెలియని మా అమ్మ ఏదో కమిట్మెంట్ అంటున్నారు ఏంటో తెలియడం లేదు నువ్వే మాట్లాడు అని అమ్మ నాతో చెప్పింది. అయితే వారి ప్రపోజల్‌కి తాను నో చెప్పానని వితిక తెలిపింది. రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఛాన్స్ ఇవ్వండి అని కోరాను. కమిట్మెంట్ కి మాత్రం ఒప్పుకోను అని చెప్పడంతో ఆ సినిమాలో మరో అమ్మా యిని తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఇలా చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్టు వితిక షేరు వివరించింది.












Click it and Unblock the Notifications