యంగ్ క్రికెటర్‌ను మ్యారేజ్ చేసుకుంటున్న విజయ్ దేవరకొండ లవర్?
అర్జున్ రెడ్డి సినిమాను తెలుగువారు అంత తొందరగా మర్చిపోరు. విభిన్నమైన స్క్రీన్ ప్లేతో సందీప్ రెడ్డి వంగా పరిశ్రమపై తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు మంచి హిట్ అయినప్పటికీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమా ఘోరా పరాజయం పాలవడంతోపాటు విజయ్ కెరీర్ నే ప్రశ్నార్థకం చేసింది. అంత డిజాస్టర్ గా నిలిచిన తర్వాత జాగ్రత్తగా ఆచితూచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.
కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది
ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తున్న అనన్య పాండే సీటీఆర్ఎల్ అనే సినిమాతో నేరుగా ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. మంచి విజయాన్ని సాధించడంతో అనన్యకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఒక తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చిందికానీ నటించలేదు. తాను ఎక్కడున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ అన్ని విషయాలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఆ ఫొటోలతో కుర్రకారుకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తుంటుంది. తాజాగా అనన్య పాండే వివాహం చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు
కొన్నాళ్లుగా అనన్య ఆదిత్యరాయ్ కపూర్ తో డేటింగ్ లో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. అయితే హఠాత్తుగా బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. తాజాగా అనన్య ఓ యువ క్రికెటర్ ను వివాహం చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే టీమ్ ఇండియా ఆటగాడిగా అడుగుపెట్టిన రియాన్ పరాగ్ ను పెళ్లి చేసుకుంటుందంటున్నారు. 2025 ఫిబ్రవరి మాఘమాసంలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అనన్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భుజానికి గాయం కావడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ ట్వంటీ సిరీస్ ను రియాన్ పరాగ్ ఆడలేకపోయాడు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో రియాన్ ఉన్నాడు.












Click it and Unblock the Notifications