డీజే టిల్లు వదులుకున్న స్టార్ హీరో?
కొన్ని కొన్నిసార్లు కథలు ముందుగా కొందరు హీరోల దగ్గరకు చేరుకుంటాయి. అయితే అనివార్య కారణాలవల్ల లేదంటే కథ నచ్చకో, మరే ఇతర కారణమో కానీ కొందరు చేయడానికి ఆసక్తి చూపరు. తర్వాత అవి బ్లాక్ బస్టర్ అవుతాయి.. కొన్ని ప్లాప్ అవుతాయి. బ్లాక్ బస్టర్ అయినప్పుడు మాత్రం అయో.. చేసుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అప్పటికే చేయి దాటిపోతుంది.. చేసేదేమీ ఉండదు.
డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు ముందుగా అనుకుంది సిద్ధు జొన్నలగడ్డను కాదు. విజయ్ దేవరకొండచేత చేయించాలని నిర్మాత, దర్శకులు అనుకున్నారు. అయితే పదే పదే బోల్డ్ టైప్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారని విజయ్ భావించాడు. దీంతో ఆ సినిమా చేయనని చెప్పాడు. విభిన్నమైన షేడింగ్స్ చూపించడానికి అవకాశం ఉన్నప్పటికీ విజయ్ ఆ సినిమాను వదులుకోవడం సరైనదే అని అభిమానులు అంటున్నారు.

సినిమా హిట్ అవుతుందని తెలిసినప్పటికీ ఎంతో ధైర్యంగా విజయ్ దేవరకొండ సినిమాను తిరస్కరించాడని, ఆ ధైర్యానికి గ్రేట్ అంటూ అభిమానులు పొగుడుతున్నారు. ఒకవేళ విజయ్ ఒప్పుకొని ఉంటే బోల్డ్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ ను ప్రజలు ఇష్టపడేవారు కాదని అభిప్రాయపడుతున్నారు. డీజే టిల్లు ఒప్పుకొని ఉంటే తప్పనిసరిగా టిల్లు స్క్వేర్ చేయాల్సి వచ్చేదని, వెంట వెంటనే రెండు బోల్డ్ పెర్ఫార్మెన్స్ సినిమాలు చేసివుంటే సినీ పరిశ్రమలో పరువు పోయేదంటున్నారు.

హిట్ సినిమాను వదులుకొని విజయ్ బతికిపోయాడంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ తాజాగా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. అనుపమ క్యారెక్టర్ కు, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమా ఎటువంటి విజయం సాధిస్తుందనే విషయమై మరో మూడురోజులకు ఒక స్పష్టత రానుంది. సూపర్ హిట్ దిశగా పయనిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications