హీరోయిన్ కోసం కొట్టుకున్న ఇద్దరు హీరోలు
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అయితే ఓ హీరోయిన్‌ను ఇద్దరు హీరోలు గాఢంగా ప్రేమించడం జరిగింది. అయితే ఓ హీరో మాత్రం ఈ ప్రేమ వల్ల తన కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు..వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్‌లో వివేక్ ఒబెరాయ్‌కు ఒకప్పుడు సూపర్ క్రేజ్ ఉండేది.
సురేష్ ఒబెరాయ్ తనయుడుగా వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.వివేక్ ఒబెరాయ్ 'కంపెనీ'తో సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇదే సమయంలో అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన ఐశ్వర్యరాయ్‌తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు కలిసి చాలాకాలం డేటింగ్ చేశారు. పార్టీల్లో , పబ్‌ల్లో కనిపిస్తూ తమ రిలేషన్‌ను బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం ఐశ్వర్యరాయ్‌తో క్లోజ్‌గా కనిపించేవారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వివేక్ ఒబెరాయ్ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇదే సమయంలో సల్మాన్ ఖాన్ సైతం వివేక్ ఒబెరాయ్‌ను బెదిరించినట్టు వార్తలు వచ్చాయి.

ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ వివేక్ ఒబెరాయ్‌కు బ్రేకప్ చెప్పి, సల్మాన్ ఖాన్‌తో కొన్నాళ్లు రిలేషన్ మెయిన్‌టైన్ చేసింది. అయితే వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయింది. జింకను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లడంతో ఐశ్వర్యరాయ్ అతనికి దూరం జరిగింది.ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ ఇద్దరు వరుస సినిమాలు చేయడం,ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించడంతో , వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్యరాయ్‌తో బ్రేకప్ తర్వాత వివేక్ ఒబెరాయ్ మరో పెళ్లి చేసుకోగా, సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటికి సింగిల్‌గానే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications