నెలకు 20 సార్లు అలాంటి పని చేశా.. కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెప్పుకొచ్చింది.

ప్రముఖ భోజ్‌పురి హీరోయిన్ అక్షర సింగ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.నటిగా కాకుండానే గాయనిగా కూడా అక్షర సింగ్‌కు మంచి గుర్తింపు ఉంది. ప్రాణ్ జాయ్ పర్ వచన్ నా జాయ్ (2011),సత్యమేవ జయతే (2013),దిల్‌వాలే (2014),నిరహువా హిందుస్తానీ (2016),అవతార్ (2017),రాజా రాణి (2018),కసమ్ తేరా నామ్ హై (2019), శుభ్ ఘడి ఆయా (2021), వంటి సూపర్ హిట్ సినిమాల్లో అక్షర సింగ్ నటించారు. సోషల్ మీడియాలో అమ్మడకు విపరీలమైన ఫాలోయింగ్ ఉంది. 6.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నది.

Heroine Akshara Singh open comments on casting couch

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ బ్యూటీ భోజ్‌పురి సినీ నటుడు పవన్ సింగ్‌తో ప్రేమలో పడింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు.బ్రేకప్‌పై అక్షర సింగ్ అప్పట్లో ఓపెన్ కామెంట్స్ చేసింది. నేను ఓ వ్యక్తిని నెలకు 20 సార్లు ప్రేమించాను. కానీ విడిపోయాము. కానీ విడిపెచినప్పుడు ఆ నింద అమ్మాయిలపైనే పడుతుంది. అమ్మాయినే నిందిస్తున్నారు. అమ్మాయిలు భావోద్వేగానికి లోనవుతున్నారు.. అందరూ ప్రేమించలనే కోరుకుంటారు.. విడిపోవాలని ఎవరూ కోరుకోరని తెలిపింది.

తాజాగా ఈ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే ఉండదని, ప్రతీ ఇండస్ట్రీలోనూ ఈ దోపిడీ జరుగుతోందని అక్షర సింగ్ చెప్పుకొచ్చింది.సినీ ఇండస్ట్రీలో రాజీ పడకూడదని నిర్ణయించుకుంటే, ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. కానీ చాలా మంది రాజీ పడడాన్నే ఎంచుకుంటారు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మీరు ఎందుకు రాజీ పడతారు? ప్రతి ఒక్కరికి ఒక ఎంపిక ఉంటుంది.రాజీపడాలనుకునే వారు అలా చేస్తారు, తమ సూత్రాలపై స్థిరంగా నిలబడాలనుకునే వారు స్థిరంగా ఉంటారంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+