వామ్మో... అలియా భట్ కు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా?
బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్స్ లో అలియా భట్ ఒకరు. రణబీర్ ను వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో తన జోరు తగ్గలేదు. 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె కెరీర్ లో 2022వ సంవత్సరం బెస్ట్ అని చెప్పొచ్చు. రాజీ, గంగూబాయి కతియావాడి, రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని వంటి సినిమాలు అలియాకు ఎంతో పేరును తెచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యారు.
రణబీర్ కపూర్ ను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత ఏడాదికి రాహాకపూర్ కు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .10కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది. 2018లో లండన్ లోని కోవెంట్ గార్డెన్ లో రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. లండన్ లో అత్యంత ధనవంతులు నివసించే ప్రాంతాల్లో కోవెంట్ గార్డెన్ కూడా ఒకటి. 2020లో బాంద్రా లో వాస్తు పాలీ హిల్స్ కాంప్లెక్స్ లోని 5వ అంతస్తు లో రూ.40 కోట్లు విలువైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశారు.

తన సోదరి నివసించే జుహు ప్రాంతంలో మరో ఇల్లు కొన్నది. 2020లో Ed -a-Mumma పేరుతో ఒక వస్త్ర బ్రాండ్ ను తీసుకొచ్చింది. ఈ కంపెనీ విలువ రూ .150 కోట్లకు పైగా ఉంటుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ లో 51 శాతం షేర్లకు ఆలియా భట్ Ed -a-Mumma జాయింట్ వెంచర్ పై సంతకం చేసింది. ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ పేరుతో 2019లోనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు అలియా దగ్గర ఉన్నాయి. మొత్తం మీద రూ.600 కోట్లకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications