కొడుకును ఆ మతంలోకి మార్చిన తెలుగు హీరోయిన్
హీరోయిన్ అమలా పాల్ ఏం చేసిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆమె పెళ్లి , విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్ని కూడా సంచలనమే అని చెప్పాలి. అమలా పాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తమిళ హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటికీ, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంతో కూడా అమలా పాల్ వార్తల్లో నిలిచారు. అమలా పాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. దర్శకుడు విజయ్‌ను అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో వీరు విడాకులు తీసుకున్నారు.
విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలా పాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ బ్యూటీ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచయం చేసింది. గత ఏడాది అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్‌ను పరిచయం చేసిన అమలా పాల్ ..సరిగ్గా పది రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. అమలా పాల్ ఇంత సడన్‌గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అమలా పాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని మాటలు తెర మీదకు వచ్చాయి.

తర్వాత ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..పెళ్లికి ముందే తాను గర్భవతిని అయ్యానని చెప్పి షాకిచ్చింది. ఇదిలా ఉంటే అమలా పాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అమలా పాల్ తన కుమారుడికి బాప్టిజం చేయించి, మతం మార్చిన వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే వివాహం చేసుకున్న అమలా పాల్, తన కుమారుడు అన్వర్‌ను క్రైస్తవ మతంలోకి మార్చినట్లు తెలుస్తోంది.
అమలా పాల్ తన కొడుకు అన్వర్‌కు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బాప్టిజం చేయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఈ వార్త వైరల్ అయింది. ఈ ఫోటోలలో అమలా పాల్, జగత్ దేశాయ్ తమ బిడ్డతో కలిసి చర్చిలో ఆశీర్వచనం అందుకుంటున్నట్లు కనిపించారు. అమలా పాల్ తన కుమారుడికి బాప్టిజం చేయించిన విషయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని పేర్కొంటుండగా, మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications