విడాకులు తీసుకున్న నిర్మాతను పెళ్లి చేసుకోనున్న హీరోయిన్ అంజలి..?
హీరోయిన్ అంజలి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవ్వడానికి తెలుగు హీరోయిన్ అయినా అంజలి తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యింది. తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా ఫొటో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సత్తా చాటింది. కరతు తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
వరుస సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కెరీర్ పీక్ టైం లో కుటుంబ గొడవలతో కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. ఇదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరు కలిసి సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో షాకిచ్చింది. హీరో జైకు బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది.

ఆ తరువాత సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ.. పెద్దగా అవకశాలు దక్కలేదు. తాజాగా అంజలి పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంజలి త్వరలోనే ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.ఇప్పటికే తన భార్యతో విడిపోయిన ఓ తెలుగు ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకోబోతుందట అంజలి. ఆ ప్రొడ్యూసర్‌తో అంజలి పీకల్లోతు ప్రేమలో ఉందట. త్వరలో పెళ్లితో ఒక్కడవమే బాకీ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. దీనిపై అంజలినే క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి పుకార్లు వస్తునే ఉంటాయి.
-
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
రాష్ట్రంలో 'బీచ్ వెడ్డింగ్' జోరు.. తక్కువ ధరకే సముద్ర తీరాన వివాహం.. -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? -
తప్పేం చేయలేదు.. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి షాకింగ్ స్పందన! -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’












Click it and Unblock the Notifications