హీరోయిన్ అంజలిని ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేసిన హీరో
హీరోయిన్ అంజలి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవ్వడానికి తెలుగు హీరోయిన్ అయినా అంజలి తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యింది. తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా ఫొటో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సత్తా చాటింది. కరతు తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
వరుస సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కారణం తెలియదు కానీ అంజలికి తెలుగులో అనుకున్నంత స్థాయిలో అవకాశాలు దక్కలేదు. స్టార్ హీరోలు, దర్శకులు అంజలి టాలెంట్‌ను సరిగా గుర్తించలేదనిపిస్తోంది.

కెరీర్ పీక్ టైం లో వ్యక్తిగత గొడవలతో కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. ఇదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరు కలిసి సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో అతనికి షాక్ ఇస్తూ.. బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది.
అయితే తనని దారుణంగా మోసం చేయడం వల్లే జై నుంచి అంజలి విడిపోయినట్టుగా తెలుస్తోంది అంజలితో రిలేషన్‌లో ఉన్న సమయంలో ఆమెతో సినిమాలు చేసే దర్శక, నిర్మాతలకు జై కండిషన్లు పెట్టేవాడని తెలుస్తోంది. ఆమెను ఏదైనా సినిమా కోసం కలవాలంటే ముందుగా జై పర్మిషన్ తీసుకోవాలని చాలామంది నిర్మాతలు చెప్పడం జరిగింది. అలాగే అవుట్ డోర్ షూటింగ్‌లకి వెళ్లిన సమయంలో ఆమెతో పాటు జై కూడా వచ్చేవారట.
ఆయన ఖర్చులు కూడా ఆ సినిమా నిర్మాత భరించాల్సి వచ్చేదట. అంతేకాదు కొన్ని హిట్ సినిమాల్లో సైతం అంజలిని నటించకుండా చేశారట. ఆ కథలు అంజలి దాకా రాకుండానే జై ఆ స్టోరీస్ విని రిజెక్ట్ చేసేవారట. ఇదే సమయంలో అంజలి తాను సంపాదించిన డబ్బులు కూడా చాలావరకు జై కి అప్పజెప్పేదని తెలిసింది. కొన్నాళ్లకు అసలు విషయం తెలియడంతో అంజలి జై కి బ్రేకప్ చెప్పేసింది. అలా పెళ్లి చేసుకుంటారు అనుకున్న ఈ జంట విడిపోయారు. ప్రస్తుతం అంజలి వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.












Click it and Unblock the Notifications