సినిమాలో అవకాశమని చెప్పి తండ్రి వయసున్న నిర్మాత అలా చేశాడు
సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది.
ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది.

'పేకమేడలు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయింది అనూష కృష్ణ. కన్నడ ఇండస్ట్రీలో అనూష కృష్ణ మంచి గుర్తింపు ఉంది. అక్కడ రెండు సినిమాల్లో నటించినప్పటికి, అవి విడుదలకు ఇంకా నోచుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా అనూష కృష్ణ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత యాక్టింగ్ మీద ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చానని ఆమె తెలిపింది.
అయితే తొలినాళ్లలో ఓ నిర్మాత సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఈ భామ చెప్పుకొచ్చింది. తండ్రి వయస్సు ఉన్న నిర్మాత నేను చెప్పినట్లు చేస్తే మా సినిమాలో హీరోయిన్ నువ్వే అంటూ చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించారని అనూష కృష్ణ పేర్కొంది. నాకు అప్పటికే ఎంగేజ్మెంట్ అయిందని చెప్పినప్పటికి ఆయన వినలేదని, నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవని చెప్పాడని చెబుతూ బాధపడింది. గంటలో ఆలోచించి చెబితే, మా సినిమాలో హీరోయిన్ నువ్వే అని చెప్పడంతో అక్కడ నుంచి వచ్చేశానని అనూష కృష్ణ చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్‌పై అనూష కృష్ణ చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి.












Click it and Unblock the Notifications