ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్లు చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటితరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో ధియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియోన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.
గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు.కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషకం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా ఓ సినిమాలో 30 లిప్‌లాక్ సీన్లతో రెచ్చిపోయిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..సోనాల్ చౌహాన్. సోనాల్ చౌహాన్ మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2005లో ఫెమినా మిస్ ఇండియా మరియు మిస్ వరల్డ్ టూరిజం టైటిల్స్‌ను గెలుచుకుంది.

ఫెమినా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టూరిజం టైటిల్స్‌ను గెలుచుకున్న తర్వాత సోనాల్ చౌహాన్ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2008లో 'జన్నత్' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. బాలకృష్ణతో కలిసి నటించిన లెజెండ్ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.పండగ చేస్కో,సైజ్ జీరో,డిక్టేటర్, ది ఘోస్ట్,రెయిన్‌బో,షేర్ వంటి తెలుగు సినిమాల్లో నటించింది.
అయితే అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. ఇదిలా ఉంటే సోనాల్ చౌహాన్ ఓ సినిమాలో ఏకంగా 30 లిప్‌లాక్ సీన్లలో నటించింది. 2013లో '3G-ఎ కిల్లర్ కనెక్షన్' అనే సినిమాలో నటించింది సోనాల్ చౌహాన్. ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటించాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. కానీ రికార్డు బ్రేకింగ్‌గా ఈ చిత్రంలో 30 కిస్ సీన్స్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications