పబ్లిక్‌లో చిరిగిన హీరోయిన్ డ్రెస్
హీరోయిన్స్ అందానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అందరికి తెలిసిందే. తోటి హీరోయిన్స్ కన్నా తామే అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక సినిమా ఫంక్షన్స్‌కు వాళ్లు రెడీ అయే విధానం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా అందరి కళ్లు తమవైపు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇది కొన్నిసార్లు మిస్ ఫైర్ కూడా అవుతుంటుంది.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వేదికపైకి రాగానే నటి డ్రెస్ చిరిగిపోయింది. దీంతో అక్కడున్న వారంత కూడా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. ఈ ఘటన ఆస్కార్ అవార్డు కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఆ వివారాల్లోకి వెళ్తే.. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో 96 ఆస్కార్ అవార్డు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలోనే హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా స్టోన్‌కు ఉత్తమ అవార్డు లభించింది.

''పూర్ థింగ్స్'' సినిమాలో ఎమ్మా స్టోన్ నటనగాను ఆమె ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా తన పేరును పిలవగానే ఎమ్మా స్టోన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అక్కడే ఉన్న ''పూర్ థింగ్స్'' చిత్ర యూనిట్‌ను కౌగిలించుకుంటూ అవార్డు తీసుకోవడానికి వేదికపైకి వెళ్లింది. స్టేజీపైకి వెళ్లే సమయంలో ఆమె తన దుస్తుల వెనుక భాగాన్ని పదేపదే తాకడం కనిపించింది.
అవార్డు తీసుకునే క్రమంలో వేదికపైకి వెళ్లిన ఎమ్మా స్టోన్ డ్రెస్ ఒక్కసారిగా చినిగిపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. "నా దుస్తులు చిరిగిపోయాయి. నాకు చాలా ఖచ్చితంగా తెలుసు" అని ఆమె చెప్పింది. తోటి నటులు ఆమెను రక్షించడానికి వచ్చారు. డ్రెస్ చిరిగినప్పటికీ ఏమాత్రం తడబాటు లేకుండా ఎమ్మా తన ప్రసంగాన్ని కొనసాగించింది. ఒకనొక సమయంలో ఉద్వేగభరితంగా మాట్లాడి అక్కుడున్న వారిని ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications