నాతో వస్తావా అంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.. 'ఢీ' జడ్జ్ మరో సంచలనం

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన దగ్గర పని చేస్తోన్న మహిళా కొరియోగ్రాఫర్‌పై ఆయన లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత మూడు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను ఎట్టకేలకు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్‌ను యాడ్‌ చేశారు.

ఇదిలా ఉంటే ఢీ జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న హీరోయిన్ హన్సిక మోత్వానీకి సైతం తన కెరీర్‌లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా గతంలో వెల్లడించడం జరిగింది. హీరోయిన్ హన్సిక మోత్వానీ తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ఓ ఇంటర్య్వూ ద్వారా అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇండస్ట్రీలో అందరి మాదిరిగానే తాను అవమానాలను ఫేస్ చేశానని తాజాగా ఇంటర్య్వూలో హన్సిక చెప్పుకొచ్చారు. డిజైనర్స్ నాతో రూడ్‌గా బిహేవ్ చేసేవారని.. ఈ మోడల్‌లో బట్టలు నాకు చేయిస్తారా అని అడిగితే ..వాళ్ళు కుదరదు అని మొహం మీదనే చెప్పేసేవాళ్లని తెలిపింది.

Heroine Hansika accusations against Telugu hero

కానీ నాకు డిజైనర్ బట్టలు ఇవ్వను అన్నవాళ్ళే ఇప్పుడు నాకోసం డిజైనర్లుగా పనిచేయడానికి ఎగబడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ సమయంలోనే ఇండస్ట్రీలో తనకు ఎదురైనా వేధింపుల గురించి కూడా వెల్లడించింది. తెలుగులో ఓ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని..డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ది చెప్పానని ఈ అమ్మడు తెలిపింది. ఆ హీరో మాత్రం వెల్లడించలేదామె. దీంతో ఆ హీరో ఎవరా అని తెగా ఆరా తీస్తున్నారు నెటిజన్లు. హన్సిక తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు విష్ణు వంటి హీరోలతో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+