స్టార్ హీరోయిన్ ఇంతమంది హీరోలతో ఎఫైర్ నడిపిందా..?

హీరోయిన్ మనీషా కొయిరాలా అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 1990ల్లో అభిమానులకు మనీషా కొయిరాలా సుపరిచితురాలే. ఆమె తెలియని సినీ అభిమాని ఉండరు. తన అందంతో, నటనతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఒకే ఒక్కడు, దిల్‌సే వంటి సూపర్ హిట్లతో మనీషా కొయిరాలా స్టార్ హీరోయిన్‌గా మారింది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తన సినీ జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. మనీషా కొయిరాలా 19 జూన్ 2010న నేపాల్ పారిశ్రామికవేత్త అయిన సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.దీంతో భర్తకు సామ్రాట్ దహల్‌ విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు మనీషా కొయిరాలా చాలామందితో ప్రేమాయాణం సాగించిందనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

heroine have an affairs with so many heroes

సెలబ్రిటీలతో మనీషా కొయిరాలా ఎఫైర్స్ పెట్టుకుందంటూ వార్తలు వచ్చాయి.చాలామంది హీరోలతో ప్రేమాయణం సాగించినా అవి పెళ్లి వరకు దారి తీయలేదు. నానా పటేకర్‌తో మనీషా కొయిరాలా ఎఫైర్ సాగించిందనే వార్త అప్పట్లో సంచలనం సృ‌ష్టించింది.నానా పటేకర్‌తో పాటు, వివేక్ ముశ్రన్, డీజే హుస్సేన్, సిసిల్ ఆంథోనీ, ఆర్యన్ వేద్, ప్రశాంత్ చౌదరి, క్రిస్పిన్ కాన్రాయ్, తారిక్ ప్రేమ్‌జీ, రాజీవ్ మూల్‌చందానీ మరియు క్రిస్టోఫర్ డోరిస్‌లతో మనీషాకొయిరాలా ప్రేమాయణం నడిపిందని గుసగుసలు వినిపించాయి.

విడాకులు తీసుకున్న తరువాత మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఒక వ్యక్తిపై నాకు ప్రేమ ఎప్పుడు లేదు..' అంటూ విఫలమైన తన వివాహం గురించి చెప్పుకొచ్చింది. జీవితంలో తన భర్తే శత్రువు అని తెలిపింది.'పెళ్లైన ఆరు నెలలకే, నా భర్త నాకు శత్రువు అయ్యాడు. ఓ మహిళకు ఇంతకంటే దారుణం ఏముంటుంది...' అని చెప్పుకొచ్చింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఒకప్పటి ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. మనీషా కొయిరాలాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తన అభిమానుల కోసం ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+