సూర్యతో అందుకే వేరుగా ఉంటున్న.. విడాకులపై స్పందించిన జ్యోతిక

ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు.

ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య అతని భార్య జ్యోతిక జంట సైతం విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు తెర మీదకు వచ్చాయి. గత కొంతకాలంగా సూర్య- జ్యోతికల మధ్య గొడవలు జరుగుతున్నాయని..వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో..జ్యోతిక ఏకంగా ముంబైకి తన మకాన్ని మార్చిందనే కథనాలు ఆ మధ్య చాలానే ప్రసారం అయ్యాయి.

Heroine jyothika clarification about divorce with hero Suriya

ఈ వార్తలకు బలం చేకూరుస్తూ...జ్యోతిక పిల్లలతో సహా ముంబైకి వచ్చేయడంతో పాటు, కొత్త సంవత్సరం నాడు సూర్య ఒక్కడే అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో.. సూర్య - జ్యోతిక విడాకుల వార్తలు నిజమే అని అంతా భావించారు. విడాకులపై వస్తున్న వార్తలను అటు సూర్య కానీ ఇటు జ్యోతిక ఎవరూ ఖండించకపోవడంతో వారి అభిమానులు నిరాశలో కురుకుపోయారు.

తాజాగా దీనిపై జ్యోతిక క్లారిటీ ఇచ్చారు. తాను వరుసగా సినిమాలు కమీట్ అయ్యానని..అందుకే ముంబై వచ్చానని.. దీనికి తోడు పిల్లల చదువు కోసం కూడా ముంబైకి రావాల్సి వచ్చిందని జ్యోతిక తెలిపారు. అంతే కాని నాకు సూర్యకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. పిల్లలు చదువు పూర్తి కాగానే తిరిగి చైన్నై వెళ్లిపోతామని ఆమె చెప్పుకొచ్చారు. సూర్య కూడా షూటింగ్ గ్యాప్ దొరికితే తమ దగ్గరకు వచ్చి వెళ్తున్నారని జ్యోతిక చెప్పుకొచ్చారు. జ్యోతిక క్లారిటీ ఇవ్వడంతో విడాకులపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+