స్టార్ హీరోయిన్ తల్లి కాబోతుందా..ఆ హీరోతో కలిసి అక్కడకు వెళ్లడంతో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆమె గర్భవతి అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ వివారాల్లోకి వెళ్తే..బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కత్రినా కైఫ్ ఓ వెలుగు వెలిగారు. కెరీర్ తొలినాళ్లలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కత్రినా కైఫ్..ఆ తర్వాత తనని తాను మార్చుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్స్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

ఇక కత్రినా కైఫ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె డ్యాన్స్‌కు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె ఏ రేంజ్‌లో అదరగొడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పలువురు హీరోలతో కత్రినా కైఫ్ ఎఫైర్లను బాగానే నడిపింది.రణబీర్ కపూర్, సల్మాణ్ ఖాన్ వంటి హీరోలతో ప్రేమయాణం సాగించింది. ఆ తర్వాత వీరికి బ్రేకప్ చెప్పి..యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లాడింది. . 2021 డిసెంబర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం ఎవరి ప్రొఫిషన్‌లో వారు బిజీగా ఉన్నారు.

Heroine Katrina Kaif is going to be a mother

ప్రస్తుతం కత్రినా గర్భవతి అనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్ కు క్యాట్ భ‌ర్త‌తో క‌లిసి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుకల్లో క‌త్రినా ప్రతిసారి తన ఉదరాన్ని దుపట్టాతో పదే పదే దాచుకుంటూ కనిపించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. కత్రినా లండన్‌లో దర్శనం ఇచ్చింది.

భార్య చేయి ప‌ట్టుకుని విక్కీ కౌశ‌ల్ నెమ్మ‌దిగి న‌డిపించుకుంటూ తీసుకెళ్తోన్న ఓవీడియో వైర‌ల్ వుతుంది. ఇందులో క‌త్రినా పొట్టభాగం బాగా ఎత్తుగా ఉన్న‌ట్లు గ‌మ‌నించొచ్చు. కొంత కాలంగా క్యాట్ ఎలాంటి సినిమా షూటింగ్ ల్లో కూడా పాల్గొన‌లేదు. కొత్త సినిమాల‌కు కూడా సైన్ చేయ‌లేదు. ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో కెమారాకి దూరంగా ఉంటున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. విక్కీ కౌశ‌ల్, కత్రినా స్పందిస్తే తప్పిస్తే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+