టాటూ వేయించుకున్న నిహారిక.. ఎక్కడంటే..!
మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి, మెగా బ్యూటీ నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత స్వేచ్ఛగా తాను అనుకున్న రంగంలో విజయం సాధించేందుకు అడుగులు వేస్తోంది. ఫ్యాషన్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నిహారిక నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తూ వస్తోంది. కమిటీ కుర్రాళ్లు పేరుతో తీస్తున్న సినిమాను త్వరలోనే విడుదల చేయబోతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. నెటిజన్లు మాత్రం తాజాగా ఆమె విడుదల చేసిన ఓ ఫొటోతో నెగెటివిటీ చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
నలుపు రంగు దుస్తుల్లో..
నలుపు రంగు దుస్తుల్లో దర్శనమిచ్చిన బ్యూటీ.. 'హైలెట్ ఆఫ్ ద డే' అనే క్యాప్షన్ తో పోస్ట్ పెట్టింది. చేతిలో కాఫీ మగ్ పట్టుకున్న ఈ ఫొటోను నటుడు ప్రియదర్శి తీశాడని నిహారిక చెప్పింది. మీరంతా కలిసి తాగుతారంటగా, మమ్మల్ని కూడా పిలుస్తారా? అని కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. సభ్యత లేని మరికొందరు అసభ్య పదజాలాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఫొటోలో నిహారిక వేయించుకున్న టాటూ ప్రత్యేకంగా కనపడుతోంది. యాంకిల్ పై ఆకాశం నుంచి వర్షం కురుస్తున్నట్లుగా టాటూ బాగుందంటూ ప్రశంసలు వస్తున్నాయి.

రెండువైపులా ఆలోచించాలి
నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి విడాకుల వ్యవహారం తరుచుగా వార్తల్లో నిలవడమేకాదు.. నిహారికకు విపరీతమైన పాపులారిటీని తీసుకొచ్చింది. ఓసారి మాత్రం యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి నిహారిక మాట్లాడుతూ తాను ఎంతో బాధను అనుభవించానని, ఎన్నోసార్లు ఏడ్చానని, తాను ఎదుర్కొన్న సమస్యలను అన్నింటినీ చెప్పింది. అయితే నిహారిక చెప్పినదాన్ని చైతన్య ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడటం సరికాదని, రెండువైపులా ఆలోచించాలని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.












Click it and Unblock the Notifications