పెళ్లి కాకుండానే రెండేళ్లుగా పిల్లలను కనేందుకు ట్రై చేస్తున్నా..హీరోయిన్ వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఒకరు. ''కృష్ణగాడి వీర ప్రేమగాథ'' సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగులో హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం , అభినయంతో ఆకట్టుకున్న మెహ్రీన్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందని అందరూ భావించారు.
అయితే వరుస ఫ్లాపులు రావడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మెహ్రీన్‌కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. రష్మిక, పూజా హెగ్డె వంటి హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో మెహ్రీన్‌ను దర్శక-నిర్మాతలు పక్కన పెట్టేశారు. మెహ్రీన్ ఫిర్జాదా తాజాగా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నట్టు తెలిపింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోవడంతో తాను ఆ పని చేసినట్టు మెహ్రీన్ తెలిపింది. దాదాపు రెండేళ్లుగా ఇందుకోసం ప్రయత్నిస్తున్నానని, ఇప్పడు సక్సెస్ అయిందని చెప్పుకొచ్చింది. వయస్సు దాటిన తరువాత పెళ్లి చేసుకున్నప్పుడు ఈ ఎగ్స్ ఉపయోగకరంగా ఉంటాయని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.

దీని గురించి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇదిలా ఉంటే భవ్య బిష్టోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ ప్రేమయాణం సాగించింది. భవ్య బిష్టోయ్ తాత మాజీ సీఎం కావడం ఇక్కడ మరో విశేషం. మెహ్రీన్ తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకుంది. ఈక్రమంలోనే తాను ప్రేమించిన భవ్య బిష్టోయ్‌తో నిశ్చితార్థం వరకు వెళ్లింది. అయితే సడన్‌గా ఏమైందో తెలియదు కానీ..అతనితో వివాహాన్ని రద్దు చేసుకుని అందరికి షాకిచ్చింది.
కారణం తెలుపకుండానే భవ్య బిష్టోయ్‌తో పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ప్రకటించింది. ఆ తరువాత తిరిగి సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. మెహ్రీన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. మరోవైపు తన మాజీ ప్రియుడు భవ్య బిష్టోయ్ మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. దీంతో మెహ్రీన్ అతన్ని పెళ్లి చేసుకున్న బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications