మృణాల్ ఠాకూర్ ఫొటోలు చూసి షాక్ అవుతున్న అభిమానులు?
తెలుగు సినిమాల్లో ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపించే ఓ హీరోయిన్ తన వ్యక్తిగత చిత్రాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటో చూసినవారంతా షాక్ కు గురవుతున్నారు. ఈ తరహా పాత్రల్లో తనను అసలు ఊహించుకోలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె ఎవరో కాదు.. సీతారామం సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్.
మహారాష్ట్రకు చెందిన మృణాల్ కళాశాలలో చదువుతున్న సమయంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. స్టార్ ప్లస్ లో వచ్చిన 'కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్'లో, ఆ తర్వాత థ్రిల్లర్ సీరియల్ లో కనిపించింది. మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత 2014లో విడుదలైన మరాఠీ చిత్రం విట్టిదండులో యాక్ట్ చేసింది. ఈ సినిమాలో ఆమె వైద్యురాలి పాత్ర పోషించింది. అనంతరం పలు వెబ్ సిరీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో తొలిసారిగా నాని నటించిన 'జెర్సీ'లో కనిపించింది. తర్వాత 'సీతారామం'లో సీతగా ఆకట్టుకుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా మృణాల్ ఠాకూర్ ను చూసి సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. ఈ భామ బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తన అందాలను ఆరబోస్తున్న మృణాల్ ఠాకూర్ ను ఒక్కసారిగా ఇలా చూసేసరికి తెలుగు సినీ అభిమానులంతా షాక్ అయ్యారు. తనేమిటి? ఇలా చేసింది? ఇలాంటి ఫొటోలు దిగింది? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలా ఫొటోలు షేర్ చేస్తూ గ్లామర్ షో చేయడానికి కారణమేమిటో అంటున్నారు.












Click it and Unblock the Notifications