'సలార్' ఓ చెత్త సినిమా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్'పై మొదటి నుంచి కూడా బాలీవుడ్ మీడియా వ్యతిరేకంగానే ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్ ఖాన్‌త్రయం కట్టుకున్న కోటలకు బీటలు వారాయి. ఆ తరువాత ప్రభాస్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ కలెక్షన్లు బాగానే సాధించాయి.
ముఖ్యంగా 'సాహో' తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో ఈ సినిమా ఏకంగా 100 కోట్లు రాబట్టి.. ప్రభాస్ స్టామినాను మరోమారు బాలీవుడ్ జనాలను రుచి చూపించింది. దీంతో సలార్ సినిమాపై బాలీవుడ్ మీడియా మొదటి నుంచి నెగిటివ్‌గా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనికి తోడు షారుఖ్ ఖాన్ నటించిన డంకీ కూడా సలార్‌తో పోటీ పడటంతో.. ప్రభాస్ సినిమాపై బాలీవుడ్‌లోని ఓ వర్గం గట్టిగానే ట్రోల్ చేయడం మొదలుపెట్టింది.

వీటిన్నింటిని తట్టుకుని ప్రభాస్ 'సలార్' బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది. 'సలార్' ముందు షారుఖ్ డంకీ తేలిపోయింది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం 'సలార్' సినిమానే బాగుందని చెప్పడంలో...అక్కడి మీడియా ఏం చేయలేక చేతులేత్తేసింది. తాజాగా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ 'సలార్' సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 'సలార్' చెత్త సినిమా అని, ఫ్లాప్ సినిమా తీసి జనాలను పిచ్చోళ్లని చేసేలానే ఉందంటూ ట్వీట్ చేసింది. అయితే ఆమె డంకీ సినిమాపై కూడా ఇదే విధంగా కామెంట్ చేసింది.

డంకీ సినిమా కూడా బాగా లేదని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. రాజ్ కుమార్ హిరాణీ తన కెరీర్‌లో మొదటి సారిగా ఓ ఫ్లాప్ సినిమాను ఎదుర్కొన్నాడంటూ డంకీ చిత్రంపై తన అభిప్రాయాన్ని చెప్పి గాలి తీసేసింది. పాయల్ ఘోష్ చేసిన ట్వీట్లను సినీ ప్రేక్షకులు ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇక 'సలార్' బాక్సాఫీస్ తన జైత్రయాత్రను కొనసాగిస్తుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 222.17 కోట్లు షేర్, రూ. 450 కోట్లు గ్రాస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

-
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్..












Click it and Unblock the Notifications