త్రివిక్రమ్‌పై పగ పట్టిన పూనమ్ కౌర్..ఆ చాటింగ్ మొత్తం బయటపెట్టేసిందిగా..!

హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలుత సినిమాల్లో నటించిన ఈ భామ, ఆ తర్వాత తమిళ , కన్నడ బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది.

అయితే హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కస్సును వెళ్లగక్కుతుంటుంది ఈ భామ. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. గతంలో పలుమార్లు త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ అనేక మార్లు పోస్టులు పెట్టడం జరిగింది.నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోలా గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్పతున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ గతంలో పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

Heroine Poonam Kaur demands action against director Trivikram

పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్‌పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్‌ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.నేను మా అసోసియేషన్‌లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతడ్ని ప్రశ్నించలేదని , యాక్షన్ తీసుకోలేదని.. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతడ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు.నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది.

Heroine Poonam Kaur demands action against director Trivikram

తాజాగా మరోసారి త్రివిక్రమ్‌పై ఆమె పోస్ట్ పెట్టారు."త్రివిక్రమ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి," అంటూ పూనమ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.మా అసోసియేషన్‌ మెంబర్ అయినా ఝాన్సీతో జరిగిన చాటింగ్‌ను ఆమె బయటపెట్టారు.. 'నేను ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. త్రివిక్రమ్‌పై ఈ మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేశాను. ఝాన్సీతో మాట్లాడాను. మీటింగ్ పెడదాం అని చెప్పి ఆలస్యం చేశారు. సడన్‌గా తనను డిస్టర్బ్ చెయ్యొద్దని అన్నారు. దీనిపై మా అసోసియేషన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని ఆమె తెలిపారు.'మా' నుండి స్పందన లేకపోవడం పట్ల పూనమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.దీనిపై మహిళా సంఘంతో మాట్లాడతానని పూనమ్ కౌర్ హెచ్చరించారు.దీంతో వీరి వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+