సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్.. కష్టంలో అదుకున్నారంటూ కామెంట్

సినిమా ఇండస్ట్రీకి, ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ వారు అధికంగా టీడీపీకి మద్దతుగా నిలుస్తుంటారు. జగన్ సీఎం అయిన సమయంలో కూడా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఆయనకు అభినందనలు తెలిపింది లేదు. ఆ తరువాత సీఎం జగన్ ఇండస్ట్రీపై వేరే రకంగా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నారు.

ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన వారే కానీ, ఎవరూ ప్రశంసించలేదు. తాజాగా జగన్ ప్రభుత్వంపై ఓ హీరోయిన్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు పూనమ్ కౌర్. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కరోనా సమయంలో చేనేత కార్మికుల కోసం జగన్ సర్కార్ చాలా మంచి పనులు చేసింది.

Heroine poonam kaur interesting comments on jagan govt

చేనేత కార్మికుల సమస్యలపై పోరాడే కార్యకర్తగా చెబుతున్నా.. వైసీపీ ప్రభుత్వం కరోనా టైంలో చేనేత కార్మికులకు అండగా నిలవడం గొప్ప విషయంగా భావిస్తున్నాను అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో పూనమ్ కౌర్ ఇలా జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురింపించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక పూనమ్ కెరీర్ విషయానికి వస్తే..తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో హీరోయిన్‌గా నటించిన పూనమ్.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అవకాశం చిక్కినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తుంటుంది. ప్రస్తుతం పూనమ్ కౌర్ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+