బాలయ్యకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది.. అయితే ఏంటి?
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ "డాకు మాహారాజ్" సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు బాలకృష్ణ అఖండలోనూ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో హిట్ పెయిర్ గా బాలయ్య- ప్రగ్యా జైస్వాల్ గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా మరోసారి అఖండ- 2 చిత్రంలోనూ కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ఖరారు అయింది. ఇక ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ కూడా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటి ప్రగ్యా జైస్వాల్.. బాలయ్యతో వర్క్ చేయడం గురించి మాట్లాడారు.ఆయనతో వరుస సినిమాల్లో నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వయసును చూసి అవకాశాలు..
" బాలకృష్ణ ఓ లెజెండ్. ఆయన పేరు చెప్తే.. 'పాజిటివిటి' అనే పదం గుర్తొస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆయన తేడా లేకుండా.. అందరినీ ఒకలాగే గౌరవిస్తారు. రోల్ కు తగ్గట్లుగా యాక్టర్లను ఎంపిక చేస్తారు.అంతే కాని వయసును చూసి సినిమా అవకాశాలు ఇవ్వరు. నా పాత్రకు నేను వందశాతం న్యాయం చేశానా, లేదా అనేదే ఆలోచిస్తా. నా దృష్టిలో ఏజ్ అనేది అసలు సమస్యే కాదు. 'అఖండ'లో మా ఇద్దరి కెమిస్ట్రీ చూసి నేను ఆశ్చర్యపోయాను" అని ప్రజ్ఞా తెలిపారు.
అంతేకాక 'డాకు మహారాజ్'రిలీజైనప్పటి నుంచి 'డాకు మహారాణి' అని పొగిడేస్తున్నారు. ఆ పాత్రకు ఆడియెన్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. ఒక నటిగా నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా డాకు మహారాజ్. గర్భిణి పాత్రలో నటించడం నాకు ఓ కొత్త అనుభూతి ఇచ్చిందని ప్రగ్యా అన్నారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాధించింది. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ-2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బోయపాటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.












Click it and Unblock the Notifications