పూజాహెగ్డే ఆస్తుల విలువ
నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పూజా హెగ్డే పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. మధ్యలో బాలీవుడ్ సినిమాలో ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్లినప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో గోడకు కొట్టిన బంతిలా వెనక్కితిరిగి టాలీవుడ్ కు వచ్చేసింది. దువ్వాడ జగన్నాథం ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
స్టార్ క్రికెటరతో పెళ్లి : అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. అయితే రెండు సంవత్సరాలుగా రాధేశ్యామ్, బీస్ట్, కిసీకా భాయ్... సినిమాలు ఫ్లాప్ కావడంతో అమ్మడు గ్రాఫ్ నెమ్మదిగా తగ్గుతూ రాసాగింది. గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చినప్పటికీ ఆ సినిమా అనుకోకుండా ఆలస్యం కావడంతో డేట్లు సర్దుబాటు చేయలేక తప్పుకుంది. హిట్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ అది మాత్రం తలుపు తట్టడంలేదు. స్టార్ క్రికెటర్ తో పూజా ప్రేమలో ఉందని, వారిద్దరికీ వివాహం జరగబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

యాడ్స్ ద్వారా అదనపు ఆదాయం : అయితే పూజా అభిమానులు తాజా ఎంత ఆస్తి సంపాదించింది? ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టింది? అంటూ వివరాలను శోధిస్తున్నారు. దాదాపుగా 20 సినిమాల్లో నటించి పూజాహెగ్డే రూ.60 కోట్ల ఆస్తులను కలిగివున్నట్లు తెలుస్తోంది. పలురకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఇంకోవైపు నుంచి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఒక్కో యాడ్ కు రూ.3 కోట్లు తీసుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా ఒక్కో పోస్టుకు రూ.40 లక్షల ఆదాయం పొందుతోంది. రూ.2 కోట్లు విలువైన రెండు లగ్జరీ కార్లతో పాటు.. కోటి రూపాయలు విలువ చేసి బంగారం, 10 కోట్ల రూపాయలు విలువ చేసి ఖరీదైన ఇల్లు, మరొకచోట రూ.4 కోట్ల విలువచేసే ఇంటితోపాటు కొన్నిచోట్ల స్థలాలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications