అబార్షన్‌ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు..రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు.

దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుక పడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు.

Heroine Rakul Preet Singh comments on abortion

ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు గతేడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటయ్యారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత రకుల్ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇదిలా ఉంటే రకుల్ అబార్షన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రకుల్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ చేయించుకోమని సులభంగా చెప్పేస్తారని, కానీ అది ఎంత కష్టమో ఎవరూ అర్థం చేసుకోరని రకుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

"స్కిన్ లేయర్ పీల్ చేస్తేనే ఎంత నొప్పి ఉంటుంది? అలాంటిది ఒక జీవాన్ని శరీరం నుండి తొలగించమంటే, శారీరక, మానసిక, భావోద్వేగమైన ట్రామా ఉండదా? దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు?" అని రకుల్ ప్రశ్నించారు. సైన్స్ ప్రకారం ఒక స్త్రీ శరీరం రెండు మిస్‌క్యారేజ్‌లను మాత్రమే భరించగలదని, కానీ ఐదుగురిలో ఇద్దరు మహిళలు మూడు నుంచి ఐదు అబార్షన్లు పొందుతున్నారని ఆమె వెల్లడించారు. ఈ నొప్పి గురించి భర్తలు తెలుసుకొని, భార్యలకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. అబార్షన్ల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ముందుకు రావాలని రకుల్ పిలుపునిచ్చారు.

Rakul Preet Singh has publicly addressed the issue of abortion, emphasizing the emotional and physical toll it can take on women. She has highlighted the need for open conversations about women's reproductive health and urges men to support their partners through difficult decisions.

రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "ఈ విషయంపై మాట్లాడటం ఇదే మొదటిసారి చూస్తున్నా, గర్వంగా ఉంది" అని కొందరు ప్రశంసిస్తున్నారు. మరికొందరు తమ సొంత అనుభవాలను పంచుకుంటూ, భర్త లేదా అత్తమామల మద్దతు లేక బాధపడుతున్నామని వెల్లడిస్తున్నారు. ఈ అంశంపై ఒక సెలబ్రిటీ బహిరంగంగా మాట్లాడటం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+