రకుల్ ప్రీత్ సింగ్‌కు అచ్చిరాని పెళ్లి..?
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.
అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఓ హీరోయిన్ జాతకం గురించి ఆయన చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుండటంతో మరోసారి వేణు స్వామి వార్తల్లో నిలిచారు.

సమంత, నయనతార, అనుష్కలకు పెళ్లి జీవితం అస్సలే అచ్చిరాదని, వీరు వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గతంలో వేణు స్వామి తెలిపారు. . రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్న తర్వాత అంతగా కలిసిరాదని, తాను పలు సమస్యలు ఎదుర్కొంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు రకుల్ వైవాహిక జీవితం అచ్చం ఆయన చెప్పిన విధంగానే సాగుతుండటం విశేషం.
జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది. రకుల్ భర్త జాకీ భగ్నానీకు బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. దీని ద్వారా పలు సినిమాలు తెరకెక్కించారు.
ఈ సంస్థ నుంచి ఇటీవల బడే మియా చోటే మియా సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో రకుల్ భర్త జాకీ భగ్నానీ నష్టాల్లో కూరుపోయారు. దీంతో 2 నెలల జీతాన్ని 2 సంవత్సరాలుగా ఇవ్వట్లేరని పూజా నిర్మాణ సంస్థపై ఉద్యోగులు పోస్టులు పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో రకుల్ జీవితంలో ఆర్థిక సమస్యలు మొదలు అయ్యాయి. ఈ భామకు పెళ్లి అచ్చిరాలేదని, అచ్చం వేణుస్వామి చెప్పినట్లే జరుగుతుందని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications