తెలుగు వాళ్లు తినకుండ ఉంటారేమో కానీ ఆ పని చేయకుండ ఉండలేరు - రాశి ఖన్నా
హీరోయిన్ రాశి ఖన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన ఈ భామ..జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించారు.టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు.
హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ కూడా ఇలాగే ఉంది. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి. ఒక్క ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.

దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్‌లో బికినీ, లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకుండా పోయింది. తాజాగా ఈ భామ సౌత్ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేసింది.సౌత్‌లో సినిమా అభిమానులు ఎక్కువ అక్కడ హీరోలని దేవుళ్లుగా కొలుస్తారు. మూవీ రిలీజ్ అయినప్పుడు పండుగలా భావిస్తారు. అందుకే దక్షిణాదిలో ప్రేక్షకులు తిండి అయినా మానేస్తారేమో కానీ సినిమాలు చూడటం మాత్రం ఆపరంటూ చెప్పుకొచ్చింది. అదే నార్త్‌లో జనాలు సినిమాలు పక్కన పెట్టి మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఆ తర్వాతే సినిమాలు చూస్తారని ఈ హాట్ బ్యూటీ తెలిపింది. ప్రస్తుతం రాశి ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications