19 ఏళ్ల వయసులో రష్మిక తొలి ఆడిషన్ చూశారా.. (వీడియో)
తాను చేసిన నాలుగైదు సినిమాలకే జాతీయ స్థాయిలో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక. ప్రస్తుతం పుష్ప, యానిమల్ లాంటి భారీ విజయాలను ఆస్వాదిస్తున్న ఆమె పుష్ప2 చేస్తోంది. డిసెంబరు ఆరోతేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. దీంతోపాటు హిందీలో నేరుగా చేసిన సినిమా కూడా అదేరోజు విడుదలకు వస్తోంది. 19 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఓ ఆడిషన్ కు హాజరైన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాలేజీలో చదువుకునే సమయంలో 'ఫ్రెష్ ఫేస్ కాంపిటిషన్'లో విజేతగా నిలిచింది.
రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం
2016లో తొలిసారిగా కన్నడ పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత సంవత్సరానికి రక్షిత్ షెట్టితో నిశ్చితార్థం జరిగినప్పటికీ వ్యక్తిగత కారణాలతో తర్వాత ఏడాది అది రద్దయింది. చలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన రష్మిక ఆ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, సీతారామం, పుష్ప లాంటి సినిమాలు చేసింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో సినిమాలు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. రెండు సంవత్సరాల క్రితం గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం పుష్ప2తోపాటు కుబేర, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, సికందర్, చావా సినిమాలు చేస్తోంది.

హిందీ పాటకు డ్యాన్స్
ప్రస్తుతం రష్మిక పాత వీడియో ఒకటి వైరలవుతోంది. అది ఆడిషన్ కు సంబంధించిన వీడియో. తన వయసు 19 సంవత్సరాలని, కాలేజీలో చదువుకుంటున్నానని చెప్పింది. అయితే ఆ సమయంలో కొంత తడబడింది. మరికొంత ఉద్వేగానికి లోనైంది. దీంతో ఇంగ్లిషులో కాకుండా మాతృభాష కన్నడంలో మాట్లాడాలంటూ నిర్వాహకులు సూచించడంతో కన్నడంలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది. ఇంగ్లిషులో మాట్లాడిన సమయంలో తనకేమీ అర్థం కాలేదని, తాను చేయలేనంటూ నిస్సహాయత వ్యక్తం చేసిన రష్మిక వీడియో చివరికి వచ్చేసరికి మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆజా నాచ్ లే బాలీవుడ్ పాటకు నృత్యం చేసి నిర్వాహకుల చేత శభాష్ అనిపించుకుంది. తన తొలి ఆడిషన్ ఇదేనని నిర్వాహకులకు రష్మిక చెప్పింది.
#RashmikaMandanna first audition video at the age of 19 🫡pic.twitter.com/oU1cLZ3XqK
— Movies4u Official (@Movies4u_Officl) October 7, 2024












Click it and Unblock the Notifications