ఆ హీరోతో కలిసి కారులో అడ్డంగా దొరికిపోయిన రష్మిక
గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' 'సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ మాత్రం అదిరింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి మరో సినిమాలో కనిపించలేదు. కానీ..తెర బయట మాత్రం ఈ జంట కను విందు చేస్తూనే ఉన్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవులులో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు.

ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉన్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఫొటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు.
ఆ మధ్య ఈ జంట ఒకే చోట దర్శనం ఇచ్చారు. రష్మిక, విజయ్ ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించారు. తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి దర్శనం ఇచ్చారు.విజయ్ దేవరకొండ రష్మిక ఒకే కారులో వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు.ఎయిర్‌పోర్టులో వీరిద్దరు ఒకే కారులో కనిపించారు.విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కూడా మాస్క్ వేసుకొని కార్ ఎక్కారు. ఆ తర్వాత క్షణాల్లోనే అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
అయితే అప్పటికే ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు గట్టిగా పని చెప్పడంతో, వీరి అద్భుత దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి దీనిపై ఈ హాట్ పెయిర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications