పెళ్లైన హీరోతో డేటింగ్ చేస్తోన్న సాయి పల్లవి..?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో సాయి పల్లవి కూడా ఒకరు. ఆమె సినిమాలతో కన్నా, సోషల్ మీడియాలోనే ఎక్కువ హంగామా సృష్టిస్తున్నారు. తన మొదటి సినిమా నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి..సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.
ఇక సాయి పల్లవి డ్యాన్స్‌కు అయితే ప్రత్యేక అభిమాన గణమే ఉందని చెప్పాలి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక హద్దులు దాటే గ్లామర్ షోకు సైతం సాయి పల్లవి దూరంగా ఉంటుంది.

ఇదే సాయి పల్లవిని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టంది. హీరోయిన్స్‌లో సాయి పల్లవికంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఓ పెళ్లైన హీరోతో డేటింగ్ చేస్తుందంటూ తమిళ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంతే కాకుండా ఆ హీరోకు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారట. ఈ వార్త సాయి పల్లవి అభిమానులకు షాక్‌కు గురి చేస్తోంది. సాయిపల్లవి పెళ్లైన హీరోతో డేటింగ్ చేయడం ఏంటని? షాక్ అవుతున్నారు.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అభిమానులు కొట్టిపారేస్తున్నారు. కావాలనే ఎవరో రూమర్ క్రియేట్ ప్రచారం చేస్తున్నట్టు తేల్చేశారు. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే..బాలీవుడ్‌లో 'రామాయణం' సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. తెలుగులో నాగ చైతన్యతో 'తండేల్' మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్‌లో శరవేగంగా జరుగుతుంది.












Click it and Unblock the Notifications