ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్‌కు అవకాశం ఉంది: సాయిపల్లవి
సినీ పరిశ్రమలో తన అందమైన వ్యక్తిత్వంతో, మహోన్నతమైన సిద్ధాంతంతో మంచిపేరు సంపాదించుకుంది సాయిపల్లవి. సహజమైన అందంతో అలరారే ఈ అందం తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు ఫిదా సినిమాతో పరిచయం అయింది. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటుంది. పాత్ర సాంప్రదాయాన్ని ప్రతిబింబించడంతోపాటు ముద్దు సన్నివేశాలు, చిట్టిపొట్టి బట్టలు ఉండకూడదు. ఇవన్నీ నిక్కచ్చిగా దర్శకుడికి చెబుతుంది. అందుకు ఇష్టమైతేనే సినిమా చేస్తుంది. సినిమా సమయంలో ఇలా కాదు.. అలా అయితే బాగుంటుంది అనే దర్శకుడి సలహాలను కూడా తిరస్కరిస్తుంది.
వేరే కమ్యూనిటీలో చేసుకుంటున్నారు
హిందీలో రామాయణ్, తెలుగుతో నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది. ఇటీవలే తన చెల్లెలు పూజ వివాహం వైభవంగా జరిగింది. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సాయిపల్లవి కులాంతర వివాహం గురించి గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. . తన చిన్నతనంలో తమ కమ్యూనిటీలోనే వివాహం చేసుకోవాలని చెప్పేవారని, అలా చెప్పినవారే కమ్యూనిటీని దాటి వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నారన్నారు. అయితే వారు మాత్రం తమ ప్రాంతంలో నివసించడంలేదని చెప్పారు.

వేడుకలకు పిలవరు
తమ కమ్యూనిటీవారు వేరేవారి కమ్యూనిటీలో వివాహం చేసుకుంటే వారికి ఎటువంటి వేడుకలకు పిలవరని, అలాగే ఎవరైనా మరణించినప్పుడు చేసే అంత్యక్రియలకు కూడా రానివ్వరని నచెప్పింది. తన అమ్మ, నాన్న కోయంబత్తూరులో నివసిస్తున్నారని వెల్లడించింది. సినిమాలు చేసిన తర్వాత మనగురించి బయట ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడుకుంటుంటారని, అటువంటివాటిని పట్టించుకోవద్దని, అలాగే పిల్లలను బ్లాక్ మెయిల్ చేయకూడదని, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నాన్నతో స్పష్టంగా చెప్పినట్లు తెలిపింది. సాయిపల్లవి వ్యక్తిత్వానికే లక్షల సంఖ్యలో అభిమానులుండటం విశేషం.












Click it and Unblock the Notifications