అందరూ చూస్తుండగానే స్టేజ్‌పై అతన్ని హగ్ చేసుకున్న సమంత
సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అయినప్పటికీ, ఏమాత్రం చెక్కు చెదరని అభిమానులను ఆమె సొంతం చేసుకుంది. హీరోలతో సమానంగా సమంత క్రేజ్ ఉందంటే ఆమె పాపులారిటీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమంతతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ కూడా ఫేడ్ అవుట్ అయిన పరిస్థితి. కానీ సమంత మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తున్నారు.
నాగ చైతన్యతో విడాకుల ప్రభావం సమంతపై ఏమాత్రం పడలేదనే చెప్పాలి. విడాకుల అనంతరం తెలుగు సినిమాలు చేయడం తగ్గించిన సమంత,, బాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లో మాత్రమే కనిపించింది. అయితే చాలాకాలం తర్వాత సమంత తెలుగు సినిమాలో నటించింది. శుభం అనే సినిమాలో సమంత గెస్ట్ రూల్‌లో దర్శనం ఇచ్చింది. ఈ సినిమాకు సమంతనే నిర్మాతగా వ్యవహరించారు. గరివిరెడ్డి శ్రీనివాస్, శాలిని, శ్రియ కొంతం, చరణ్ పేరి తదితర యంగ్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.

గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీనిలో భాగంగానే చిత్ర యూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈసెలబ్రేషన్స్‌లో హీరోయిన్ సమంత స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.అయితే సక్సెస్ మీట్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
Entha love unte ❤️ oka team member ki edupu ostadi 🙌 @Samanthaprabhu2 HEARTFUL MOMENT WITH HER TEAM 🥹❤️🔥👏#shubham #SamanthaRuthPrabhu#Samantha pic.twitter.com/UE58hUBJ4c
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) May 16, 2025
ఈవెంట్‌లో పాల్గొన్న సమంత అసిస్టెంట్ ఆర్యన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న అతను వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన సమంత వెంటనే అతని దగ్గరకు వెళ్లి ఓదార్చింది. అతన్ని హత్తుకుని మరి అసిస్టెంట్‌ను సముదాయించే ప్రయత్నం చేసింది. ఇది చూసిన నెటిజన్లు సమంతది మంచి మనస్సు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications