ప్రైవేట్ ఫొటోలు తీస్తావా..? బుద్ధి లేదా .. సమంత ఫైర్( వీడియో)
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది.ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య మరో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్‌గానే కొనసాగుతోంది. విడాకుల అనంతరం సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవలే సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు. తన 15 ఏళ్ళ కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ..అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మరిచిపోలేమని.. కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ సమంత తెలిపింది.

ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె జిమ్ నుండి బయలుదేరుతుండగా మీడియా ఆమెను వెంబడించారు. దీనితో అసౌకర్యానికి గురైన సమంత వారిపై సీరియస్ అయ్యింది. ఆమె స్కిన్ టైట్ స్పోర్ట్స్ వేర్ ధరించి ఉంది. బాంద్రాలో జిమ్ పూర్తి చేసుకుని ఆమె తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఒకనొక దశలో ఆమె ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న 'రక్త్ బ్రహ్మాండ్' వెబ్ సిరీస్ లో నటిస్తోంది.












Click it and Unblock the Notifications