నాగచైతన్యకు రేటింగ్ ఇచ్చిన సమంత

సమంత అనే పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. ఇటీవలే సామ్ మయోసైటిస్ తో బాధపడింది. దీనికి చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాది సమయం విరామం ప్రకటించింది. ఆ వ్యాధి నుంచి కోలుకొని మా ఇంటి బంగారం సినిమాతోపాటు సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇవి రెండూ విడుదల కావాల్సి ఉన్నాయి.

చైతూకు పదికి పది మార్కులు
నాగచైతన్యతో ఏ మాయ చేశావే సినిమాలో సమంత నటించింది. చైతన్యకు రెండో సినిమా అయితే సామ్ కు మొదటి సినిమా. వీరి మధ్య సన్నివేశాలు అద్భుతంగా వచ్చి భారీ హిట్ అయింది. ఆ సమయంలోనే చైతూతో స్నేహం ఏర్పడి తర్వాత ప్రేమగా మారింది. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో మీడియాతో మాట్లాడిన సామ్ నాగచైతన్యకు రేటింగ్ ఇచ్చింది. రొమాన్స్ లో తను చేసిన కార్తీక్ పాత్రకు పదికి పది మార్కులిచ్చింది. కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటూ పొగిడింది. తన జెస్సీ పాత్రకు రొమాన్స్ లో 3.5 మార్కులిచ్చింది. తాను అంత రొమాంటిక్ కాదని చెప్పింది.

heroine Samantha gave a rating of ten out of ten to hero nagachaitanya

వణికిపోతే సార్ కూల్ చేశారు
లుక్స్ పరంగా మహేష్ బాబుకు పదికి పది, ఎన్టీఆర్ కు 9.5 ఇచ్చింది. హృతిక్ రోషన్ తనకు నచ్చడని చెప్పింది. ఆయనకు పదికి ఏడు మార్కులిచ్చింది. నాగచైతన్యకు మాత్రం పదికి పది మార్కులిచ్చింది. అందులో వేరే ఆలోచనే లేదంది. రణ్ బీర్ కపూర్ కు 8 మార్కులిచ్చింది. సినిమా కథను దర్శకుడు గౌతమ్ తనకు చెప్పలేదని, ఆయన సినిమాలో అవకాశం రావడమే గొప్ప అన్నట్లుగా చేశానని చెప్పింది.

షూటింగ్ లో ఏరోజుకు ఆరోజు డైలాగులు నేర్చుకునేదాన్నని, అలాగే షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పింది. రెండు మూడు రోజులు గడిస్తేకానీ తాను జెస్సీ పాత్రలోకి ప్రవేశించలేకపోయానంది. సినిమాలో నాగచైతన్య ఇంటిగేటు వద్ద ఉంటాడని, ఆయన్ని చూసి చేయి ఎత్తే సీన్ లో చాలా నర్వస్ అయ్యానని, చేయి వణికిపోయిందని, గౌతమ్ సార్ కూల్ చేశాడని సమంత వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+