గుడ్ న్యూస్ చెప్పిన సమంత!
స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే ఎక్కువ ఫేమస్ అయింది. ఈరోజుకు నాగచైతన్య-సమంత జంటను ఇష్టపడే అభిమానులు వారిద్దరూ మళ్లీ కలవకపోతారా? అనే ఆశతో ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ కొంత కాలం నుంచి షూటింగ్ లకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రీట్ మెంట్ తీసుకోవడంతోపాటు విదేశాలను కూడా ఈ సమయంలో చుట్టివచ్చింది. కొత్త సంవత్సరం ఓ పోస్ట్ ద్వారా గుడ్ న్యూస్ తెలిపింది.
తన చుట్టూ ఉన్నవారిని చూసి స్ఫూర్తి పొందుతానని, కొత్త సంవత్సరం కూడా పండగ సందర్భంగా రిలాక్సింగ్ గా సాగిపోవాలంది. ఈ సంవత్సరం తాను ఆరోగ్యంపై ఫోకస్ చేస్తానని, మళ్లీ వర్క్ లోకి వెళతానని, కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకుంటానని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. సమంత తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టబోతోందని అందరికీ అర్థమైంది. ఇది తెలుసుకున్న సామ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇటీవలే సమంత ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన బ్యానర్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించనుంది. అందులో భాగంగానే బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు కోటిరూపాయల పారితోషికంతో ఒక సినిమాను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. సమంత స్నేహితులురాలు నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మొదటి ఈ పాత్రలో వేరే హీరోయిన్ అనుకున్నారుకానీ కుదరకపోవడంతో సమంతను చేయమని అడిగారు. అందుకు ఓకే చెప్పిన సామ్ ఆ సినిమాలో జొన్నలగడ్డ సిద్ధు సరసన చేయాల్సి ఉంది. తాను నటిస్తుందా? లేదంటే ఈ సినిమా నుంచి తప్పుకుంటుందా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications