సమంత లైఫ్ లో మరో నాగచైతన్య?

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇటలీలో పర్యటిస్తోంది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లింది. అక్కడి పర్యటన ముగిసిన తర్వాత ఆస్ట్రియా వెళ్లింది. ఆస్ట్రియా నుంచి ఇటలీ వచ్చింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన పర్యటనలను, కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది.

ఫొటోకు కొటేషన్ ఇచ్చింది
తాజాగా ఒక ఫొటోను షేర్ చేసింది. దానికి ఒక కొటేషన్ కూడా పెట్టింది. విన్నిస్ లో నడి మధ్యలో ఉన్న గెలాటలో స్వర్గధామం అయిన గెలాటో టెకా సుసో ఇటాలియన్ అడ్వెంచర్స్ ఫొటోస్ తో పెట్టిన కొటేషన్ ఏమిటంటే.. "వేచి చూసే వారికి ఎప్పుడూ మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి " అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ మాటలకు అర్థం ఏమిటా అని అభిమానులు ఆలోచించడం ప్రారంభించారు.

heroine samantha latest italy tour details

ఓర్పుగా ఉంటే మంచి జరుగుతుంది
ఓర్పుగా, సహనంగా ఎదురుచూడటం వల్ల ఏదో మంచే జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం కచ్చితంగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురించే ఈ పోస్ట్ చేసిందంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో జిమ్ లో తనతోపాటు ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తూ ఫొటో పెట్టింది. అతని ముఖం మాత్రం కనపడకుండా చేసింది. అప్పుడే సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ కొందరు చర్చించుకున్నారు.

నాగచైతన్య కంటే మంచివాడా?
తన బాయ్ ఫ్రెండ్ ను సమంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతందని, గొప్పవ్యక్తి, మంచివాడు అయిన ఒకతనను ఆమె జీవితంలోకి వచ్చివుంటాడని కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం నాగచైతన్య కంటే మంచివాడు, గొప్పవాడు వచ్చాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సమంతకు కొత్త జీవితం రావాలని, ఆమె ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. శాకుంతలం సినిమా తర్వాత ఖుషీ చేసింది. ప్రస్తుతానికి ఏడాదిపాటు ఎటువంటి సినిమాలు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+