కళ్లు తిరిగి పడిపోయిన సమంత
ప్రస్తుతం దేశంలోని టాప్-10 కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సమంత ఒకరు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సంవత్సరంపాటు సినిమాలకు విరామం ప్రకటించింది. అయితే అది ఎంత తప్పుడు నిర్ణయమో తెలిసివస్తోంది. గతంలో తాను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించి తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగిచ్చేసింది. ప్రస్తుతం సినిమాలు చేద్దామంటే దర్శకులు, నిర్మాతలు, హీరోలు ముందుకు రావడంలేదు.
సిటాడెల్ వెబ్ సిరీస్ చేసే సమయంలో ఈ అమ్మడు కళ్లు తిరిగి పడిపోయింది. శారీరకంగా బలహీనంగా ఉండటమే కారణం. షూటింగ్ జరగడానికి ముందే దర్శకులు భారీగా యాక్షన్ సన్నివేశాలుంటాయని ముందే చెప్పారంట. అయినా అందుకు ఇష్టపడే ఒప్పుకుంది. ఒకసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో నీరసంగా అనిపించడమే కాకుండా స్పృహ కూడా తప్పి కింద పడిపోయిందట. దీంతో సెట్ లో ఉన్నవారంతా కంగారుపడ్డారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అని వ్యాఖ్యానించింది.

ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డానని, ప్రతి ఒక్కరికి జీవితంలో చీకటి రోజులు ఉంటాయని, అందరూ అందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఓర్పుతో ముందుకు వెళ్లినవారికి కెరీర్ చాలా బాగుంటుందని తెలిపింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో నాగచైతన్యపై పరోక్షంగా కామెంట్లు చేసి అభిమానుల ఆగ్రహానికి గురైంది. అయితే నాగచైతన్య మాత్రం విడాకులు తీసుకున్న ఇన్ని సంవత్సరాల్లోను ఎక్కడా ఎప్పుడూ సమంతపై ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు.












Click it and Unblock the Notifications