కుర్రకారు గుండెల్లో లక్ష్మీబాంబులు పేలుస్తున్న సమంత

సమంత గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యశోద, శాకుంతలం తర్వాత విజయ్‌ దేవరకొండ సరసన ఖుషి సినిమాను చేసింది. ఇక సమంత ఇతర సినిమాల విషయానికి వస్తే సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. సమంత త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

కండల వీరు సల్మాన్ ఖాన్ సరసన నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ పై విష్ణువర్ధన్ తీయబోతున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. తాజాగా సమంత ఫోటో‌షూట్‌లో అందాల రచ్చ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. బ్లూ కలర్ డ్రస్ లో అందాలను చూపిస్తూ అందాల జాతర చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కుర్రాళ్ల గుండెల్లో లక్ష్మీబాంబులు పేలుస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

heroine samantha latest photoshoot

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ తో బాధపడుతోంది. తాజాగా దీనికి చికిత్స తీసుకునేందుకు ఏడాదిపాటు సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంది. నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను వారికి తిరిగిచ్చేసింది. ఇటీవలే అమెరికా, ఇటలీ తదితర నాలుగు దేశాల పర్యటన ముగించుకొని వచ్చింది. తన స్నేహితురాలు నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నప్పటికీ ఆమె స్థానంలో పూజాహెగ్డే నటిస్తోంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న నాగచైతన్య-సమంత కలకాలం మంచి దంపతులుగా నిలుస్తారని అభిమానులు ఆశించారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో మళ్లీ కలవకపోతారా? అనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+